Kadapa: అనుమానంతో భార్య చేతులు, కాళ్లను నరికిన భర్త..

ABN , First Publish Date - 2021-09-16T13:08:06+05:30 IST

చక్రాయపేట మండలం బీఎన్‌తండాలో దారుణం చోటు చేసుకుంది. భార్య ఈశ్వరమ్మ కాళ్లు, చేతులను అతి దారుణంగా నరికాడు భర్త నాగ నాయక్. ఈ ఘటన ఆలస్యంగా గురువారం

Kadapa: అనుమానంతో భార్య చేతులు, కాళ్లను నరికిన భర్త..

కడప: చక్రాయపేట మండలం బీఎన్‌తండాలో దారుణం చోటు చేసుకుంది. భార్య కాళ్లు, చేతులను అతి దారుణంగా నరికాడు భర్త. ఈ ఘటన ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. గత కొన్ని రోజులుగా భార్యపై భర్త అనుమానం పెంచుకున్నాడు. బుధవారం రాత్రి పీకల్లోతు మద్యం తాగివచ్చి భార్యతో గొడవకు దిగాడు. దీంతో వివాదం తారాస్థాయికి చేరుకుంది. సహనం కొల్పోయిన  భర్త..భార్యను కట్టివేసి చేతులు, కాళ్లను నరికేశాడు. నిందితుడు ఘటన స్థలం నుంచి పరారయ్యాడు. భార్య పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-09-16T13:08:06+05:30 IST