Abn logo
Sep 21 2021 @ 10:50AM

కడపలో కొనసాగుతున్న అధికారపార్టీ నేతల దౌర్జన్యకాండ

కడప: సీఎం జగన్ రెడ్డి సొంత ఇలాకా కడప జిల్లాలో అధికారపార్టీ నేతల దౌర్జన్యకాండ కొనసాగుతోంది.  కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు ఇటీవల వరుసగా భూకబ్జాలు, భూవివాదాలపై బెదిరింపులు, దౌర్జన్యాలకు దిగుతున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలోని కొండాపురం మండలం పొట్టిపాడు గ్రామం చిత్రావతి నది పరివాహక ప్రాంతంలో వందల ఎకరాల ప్రభుత్వ భూములను  వైసీపీ శ్రేణులు కబ్జాలు చేస్తున్నారు. ఆక్రమించిన భూముల్లో మామిడి చెట్లు నాటేందుకు ప్రయత్నిస్తుండగా స్ధానిక రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. అడ్డుకున్న రెవెన్యూ సిబ్బందిపై వైసీపీ శ్రేణులు బండబూతులు తిడుతూ దాడికి యత్నించారు. పోలీసు కేసులు పెట్టేందుకు రెవెన్యూ సిబ్బంది ప్రయత్నిస్తుండగా జమ్మలమడుగు ఎమెల్యే సుధీర్ రెడ్డి బెదిరింపులకు దిగినట్లు సమాచారం. ఎమ్మెల్యే బెదిరింపులతో  పోలీసులకు ఫిర్యాదు చేయకుండా రెవెన్యూ సిబ్బంది వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. 

ఇవి కూడా చదవండిImage Caption