Advertisement
Advertisement
Abn logo
Advertisement

కడప: ఆర్టీపీపీలో తగ్గిన విద్యుత్ ఉత్పత్తి

కడప: ఆర్టీపీపీలో విద్యుత్ ఉత్పత్తి తగ్గింది. ఆర్టీపీపీకి రావాల్సిన బొగ్గు సరఫరా ఆగిపోవడంతో విద్యుత్ ఉత్పత్తి తగ్గించి నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆర్టీపీపీలో కేవలం 30 వేల టన్నులు మాత్రమే బొగ్గు నిల్వలు ఉన్నాయన్నారు. మొత్తం ఆరు యూనిట్లలో 1650 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగాల్సి ఉందని, బొగ్గు కొరత కారణంగా ప్రస్తుతం రెండు యూనిట్లలో 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని అధికారులు తెలిపారు. మిగిలిన 4 యూనిట్లలో విద్యుదుత్పత్తి నిలిపివేసినట్లు చెప్పారు. వరదల వల్ల రైల్వే ట్రాక్‌లు పూర్తిగా దెబ్బతినడంతో ఆర్టీపీపీకి  బొగ్గు రవాణా కొరత ఏర్పడిందని అధికారులు వెల్లడించారు.

Advertisement
Advertisement