ఆదాయం జాస్తి... అభివృద్ధి నాస్తి

ABN , First Publish Date - 2020-08-02T11:19:04+05:30 IST

ఆదాయం జాస్తి... అభివృద్ధి నాస్తి

ఆదాయం జాస్తి... అభివృద్ధి నాస్తి

రైల్వేకోడూరు ప్రభుత్వమార్కెట్‌యార్డు దుస్థితి


రైల్వేకోడూరు, ఆగస్టు 1: ప్రభుత్వ మార్కెట్‌ యార్డుకు కోట్లు ఆదాయం ఉన్నప్పటికీ అభివృద్ధి విషయం సున్నా అయిపోతోంది. ప్రభుత్వ మార్కెట్‌ యార్డు పరిధిలో చిట్వేలి, కుక్కలదొడ్డి, పుల్లంపేట ప్రాంతాల్లో వ్యవసాయ మార్కెట్‌ చెక్‌ పోస్టులు ఉన్నాయి. వీటి ద్వారా గతంలో సెస్సులు వసూలు చేసే వారు. అయితే మామి డి, బొప్పాయి, అరటి తదితర పచ్చి పంటలకు గతంలో సెస్సులు రద్దు చేశారు. ప్రస్తుతం వడ్లు, మొక్కజొన్న, ఎర్రగడ్డలు, కూరగాయలు తదితర వాటికి మాత్రేమే సెస్సులు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆదాయం రూ.2 కోట్లు నిధులు ఉన్నాయి. ప్రభుత్వ మార్కెట్‌ యార్డు పరిధిలో రెండు గోదాములు గతంలో నిర్మించారు. ఇక్కడ చౌక దుకాణాలకు బియ్యం, కందిపప్పు, చక్కర తదితర వాటిని డీలర్లకు సరఫరా చేస్తున్నారు. రెవెన్యూశాఖకు రెండు గోదాములు లీజుకు ఇచ్చారు. ప్రస్తుతం యార్డులో పిచ్చి మొక్కలు దర్శనం ఇస్తున్నాయి. ఎక్కడ పాములు వస్తాయని సిబ్బం ది ఆందోళన పడుతున్నారు. మార్కెట్‌ యార్డుకు రైల్వే గేటు దాటుకుని సుమారుగా కిలోమీటర్‌ పైగా రావాల్సి ఉంది. రైల్వే అండర్‌ బ్రిడ్జి నిర్మాణం ఉండి ఉంటే వ్యాపారాలు ముమ్మరంగా సాగించే వారని రైతులు అంటున్నారు. అందు వల్ల రైతులు ఎవరు ఇక్కడి రాకుండా మైసూరివారిపల్లె వద్ద ఉన్న ప్రైవేటు మార్కెట్‌ యార్డు కు వెళుతున్నారు. గతంలో మార్కెట్‌ యార్డు నిధులతో లింకు రోడ్లు నిర్మాణం సాగించే వారు. పశు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసేవారు. అవన్ని ఆగిపోయినాయని రైతులు పేర్కొం టున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుని ప్రభుత్వ మార్కెట్‌ యార్డు ను బాగు చేయాలని రైతులు కోరుతున్నారు.


ప్రభుత్వ మార్కెట్‌ యార్డు  అభివృద్ధికి కృషి చేస్తున్నాం

ప్రభుత్వ మార్కెట్‌ యార్డు అభివృద్ధి కి కృషి చేస్తున్నాం. ప్రస్తుతం రూ.2కోట్లు నిధులు ఉ న్నాయి. పచ్చి సరుకు సెస్సులు రద్దు చేయడం తో ఆదాయం తగ్గింది. కేవలం వరి, మొక్క జొన్న, కూరగాయలు తదితర వాటికి మాత్రమే సెస్సులు వసూలు చేస్తున్నారు. పశు వైద్య శిబిరాలు నిర్వహిస్తాం.  జింగిల్‌ క్లియెరెన్స్‌కు ప్రతిపాదనలు పెట్టాం. 

- లక్ష్మీకాంత్‌బాబు, ప్రభుత్వ మార్కెట్‌ యార్డు కార్యదర్శి 

Updated Date - 2020-08-02T11:19:04+05:30 IST