Abn logo
Oct 1 2020 @ 00:54AM

ఉపాధి పనుల్లో జిల్లాకు మొదటి స్థానం

Kaakateeya

 పీడీ యదుభూషణ్‌రెడ్డి


రామాపురం, సెప్టెంబరు 30: ఉపాధి పనుల కల్పనలో రాష్ట్రంలో మన జిల్లా మొదటి స్థానంలో ఉందని పీడీ యదుభూషణ్‌రెడ్డి అన్నారు. రామాపురం ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉపాధి పనులు ప్రారంభమైన 2006 నుంచి 2018వ సంవత్సరం వరకు రోజుకు రెండు లక్షల 12 వేల మంది పనులు చేసే వారని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కరోనా ప్రభావం ఉన్నా రోజుకు మూడు లక్షల 50 వేల మంది కూలీలకు ఉపాధి పనులు కల్పించామన్నారు.


ఉపాధి పనుల్లో 102 శాతం వరకు జరిగాయని తెలిపారు. అలాగే లక్కిరెడ్డిపల్లె, వేంపల్లె, రాజంపేట మండలాల్లో గుట్టలు, కొండలపైన 5 వేల సీడ్‌ బాల్స్‌ వేశామని చెప్పారు. వన సంరక్షణ కింద జిల్లాలో రహదారికి ఇరువైపులా దాదాపు 11 లక్షల మొక్కలు నాటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీవో సురేంద్రరెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement