ఆర్డీవో కార్యాలయ సిబ్బందిపై ముంపు బాధితుల ఆగ్రహం

ABN , First Publish Date - 2020-10-28T09:07:02+05:30 IST

జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయ సిబ్బందిపై మునక గ్రామాల బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆర్డీవో కార్యాలయ సిబ్బందిపై ముంపు బాధితుల ఆగ్రహం

సిబ్బంది అవకతవకలపై బయటపెడతామని హెచ్చరిక


జమ్మలమడుగు రూరల్‌, అక్టోబరు 27: జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయ సిబ్బందిపై మునక గ్రామాల బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మునక బాధితుల లిస్టులో తమ పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి మంగళవారం ఉదయం నుంచి కార్యాలయం వద్ద పడిగాపులు కాశామని సాయంత్రమైనా తమ గురించి పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పేరు ఉందో లేదో చెప్పడానికి 5 నిమిషాల సమయం కూడా పట్టదని, కానీ తమను ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. 


రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని కొండాపురం, మునక గ్రామాలైన తాళ్లప్రొద్దుటూరు గ్రామానికి చెందిన అనేక మంది బాధితులు ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యాలయం వద్ద వేచి ఉన్నారు. తాళ్లప్రొద్దుటూరు గ్రామానికి చెందిన వెంకట రాముయాదవ్‌తో పాటు మరికొందరు నేరుగా కార్యాలయంలోకి వెళ్లి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాళ్లప్రొద్దుటూరు గ్రామంలో ఇటీవల దొంగ అకౌంట్లపై డబ్బులు చెల్లించారని ఒకరిద్దరు నాయకులు, అధికారులకు తెలిసే పనులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయంలో జరుగుతున్న అవకతవకలపై ముంపు గ్రామాల ప్రజల సమస్యలు, అధికారులు చేసిన తప్పులను తాము బయటపెడతామని తెలిపారు. ఈ సందర్భంగా విలేకరులు అక్కడ ఫొటోలు తీస్తుండగా కార్యాలయ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇక్కడ జరిగింది వార్తలు రాయకూడదని హెచ్చరించడం గమనార్హం. వెంటనే అక్కడ ఉన్న ఎక్సైజ్‌ పోలీసులు బాధితులకు సర్దిచెప్పి బయటకు పంపారు. ఈ సమస్యకు సంబంధించి ‘ఆంధ్రజ్యోతి’ ఆర్డీవో నాగన ్నను వివరణ కోరగా తాళ్లప్రొద్దుటూరు గ్రామంలో బాధితులకు సంబంధించి పేర్లు తప్పులుగా వచ్చాయని, వాటిని సరిచేసి బాధితులకు వెంటనే న్యాయం చేస్తామన్నారు. బాధితులు చెప్పిన విధంగా సమస్య లేదన్నారు.

Updated Date - 2020-10-28T09:07:02+05:30 IST