Advertisement
Advertisement
Abn logo
Advertisement

బద్వేలు అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం: పరిపూర్ణానంద స్వామి

కడప: బద్వేలు ఉపఎన్నికలో బీజేపీ తరపున ప్రచారం చేస్తున్న శ్రీ పీఠం పీఠాధిపతి శ్రీ పరిపూర్ణ నందస్వామి సోమవారం బద్వేల్ బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ రాజకీయాలంటే ఎమోషన్స్ కాదని తెలిపారు. బద్వేలు అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. సీఎం జగన్ బద్వేలు అభివృద్ధిపై దృష్టి సారించలేదని తెలిపారు. బద్వేలులో వైసీపీ చేసిన అభివృద్ధి శూన్యమని వ్యాఖ్యానించారు. అడుగడునా రోడ్లు గుంతలమయమన్నారు. కొన్ని పార్టీలు సంప్రదాయం పాటిస్తున్నామని ఎన్నికల్లో అభ్యర్థిని పెట్టలేదని తెలిపారు. బీజేపీ పార్టీ నిబద్ధతతో రాజకీయాలు చేస్తుందని స్వామీజీ చెప్పారు.


బద్వేలులో బీజేపీ అభ్యర్థి పనతల సురేష్ విద్యావంతుడని... విద్యార్థి దశ నుంచి జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగారని తెలిపారు. బీజేపీ అధిష్ఠానం విద్యావంతుడిని అభ్యర్థిగా నిలబెట్టిందన్నారు. బద్వేలు అభివృద్ధి కావాలంటే పనతల సురేష్‌ను బద్వేలు ప్రజలు గెలిపించుకోవాలని అన్నారు. అసెంబ్లీలో బద్వేలు అభివృద్ధిపై మాట్లాడే వ్యక్తి సురేష్ అని చెప్పుకొచ్చారు. ఎమోషన్లు కావాలో అభివృద్ధి కావాలో బద్వేలు ప్రజలు తేల్చుకోవాలన్నారు. రాజకీయాలంటే ప్రజలకు సేవ చేయడమే అని స్పష్టం చేశారు. కుటుంబంలో వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబంలో వ్యక్తినే ఎన్నుకోవాలనుకోవడం సరికాదన్నారు. ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని పరిపూర్ణానంద స్వామి కోరారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement