Advertisement
Advertisement
Abn logo
Advertisement

కడప: రాయలసీమ ప్రాజెక్ట్‌ల భవిష్యత్‌పై టీడీపీ సదస్సు ప్రారంభం

కడప: నగర శివారుల్లో రాయలసీమ నీటి ప్రాజెక్టుల భవిష్యత్తుపై టీడీపీ సమావేశం నిర్వహించింది. పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసుల రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ సదస్సు ప్రారంభమైంది. రాయలసీమ 4 జిల్లాల నుండి టీడీపీ మాజీ మంత్రులు కాల్వ శ్రీనివాసులు, అమరనాధ్ రెడ్డి,  ఎమ్మెల్యేలు, టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు సమావేశానికి హాజరయ్యారు. నీటిప్రాజెక్టులపై కేంద్రం గెజిట్‌ను ఉపసంహరించుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాయలసీమలో నీటి ప్రాజెక్టుల పనులు పూర్తి చేయకుండా జగ‌న్ ప్రభుత్వం నిర్లక్షం చేస్తోందని నేతలు మండిపడ్డారు. రాయలసీమలో పుట్టిన సీఎం జగన్ సీమకు ద్రోహం చేస్తున్నాడని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తన కేసులను మాఫీ చేసుకునేందుకే కేంద్రంతో కుమ్మక్కై రాష్ట్రానకి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. రాయలసీమ నీటివాటాలు, ప్రాజెక్టుల పనుల కోసం కలిసి పోరాటం సాగిస్తామని సీమ టీడీపీ నేతలు స్పష్టం చేశారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement