Abn logo
Sep 9 2021 @ 20:53PM

వివేకా హత్య కేసులో ఉమాశంకర్ రెడ్డికి రిమాండ్

కడప: వివేకా హత్య కేసులో ఉమాశంకర్ రెడ్డిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ ఉదయం నుంచి ఉమాశంకర్‌రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. అనంతరం ఉమాశంకర్ రెడ్డిని పులివెందుల కోర్టులో హాజరుపర్చారు. కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో ఉమాశంకర్ రెడ్డిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. ఉమాశంకర్ రెడ్డి సింహాద్రిపురం మండలం సుంకేసుల వాసిగా గుర్తించారు.