Advertisement
Advertisement
Abn logo
Advertisement

సీఎం ఇలాకాలో వైసీపీ నేతలకు వరుస నిరసన సెగలు

కడప: సీఎం జగన్ సొంత ఇలాకాలో వైసీపీ నాయకులకు వరుస నిరసన సెగలు తగులుతున్నాయి. రాయచోటిలో ప్రభుత్వ విప్ శ్రీకాంత్‌రెడ్డిని  వరద బాధితులు నిలదీశారు. గరుగుపల్లెలో ఇళ్లు దెబ్బతిన్నవారికి పరిహారం చెక్కులు ఇచ్చేందుకు శ్రీకాంత్‌రెడ్డి వచ్చారు. ఈ క్రమంలో అర్హులను పక్కనపెట్టి అనర్హులకు పరిహారం ఇస్తున్నారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద బాధితులందరికీ న్యాయం చేస్తామని శ్రీకాంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నిన్న పులపత్తూరు, మందపల్లెలలో సజ్జలను వరద బాధితులు నిలదీసిన విషయం తెలిసిందే. 

Advertisement
Advertisement