May 2 2021 @ 12:54PM

ఇష్టముండదు..కానీ చేయక తప్పడం లేదు..!

కాజల్ అగర్వాల్‌కి హారర్ జానర్ సినిమాలంటే ఎంతమాత్రం ఇష్టం ఉండదని ఇప్పటికే పలు సందర్భాలలో చెప్పుకొచ్చింది. అయినా హీరోయిన్ అన్నాక అన్ని రకాల పాత్రలు.. జోనర్ సినిమాలు చేయాలి కాబట్టి రీసెంట్‌గా తనకి ఇష్టం లేని హారర్ జోనర్‌లో ఓ వెబ్ సిరీస్ చేసింది. 'లైవ్ లైవ్' టెలికాస్ట్ పేరుతో రూపొందిన ఈ వెబ్ సిరీస్‌కి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. తమిళ భాషలో రిలీజై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే మరోసారి ఇదే హారర్ జోనర్‌లో కాజల్ నటిస్తోంది. ఈ సారి వెబ్ సిరీస్ కాకుండా ఏకంగా సినిమా చేయడం ఆసక్తికరమైన విషయం. ఈ సినిమాలో కాజల్, రెజీనా, రైజా విల్సన్, జనని కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్టు సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ మొదలు పెట్టబోతున్న ఈ సినిమాను పరిస్థితులు అనుకూలిస్తే థియేటర్స్‌లో రిలీజ్ చేస్తారట. లేదంటే నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు చిత్ర బృందం వెల్లడించనున్నారట. తెలుగులో కాజల్.. మెగాస్టార్ చిరంజీవి సరసన 'ఆచార్య', అలాగే ప్రవీణ్ సత్తారు - నాగార్జున కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది.