May 7 2021 @ 23:09PM

వ్యాక్సిన్‌ తొలి డోసు తీసుకున్నారు

హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌, ఆమె భర్త గౌతమ్‌ కిచ్లూ శుక్రవారం ముంబైలోని నానావతి ఆస్పత్రిలో కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ తొలి డోసు తీసుకున్నారు. వ్యాక్సిన్‌ అనంతరం ‘ఫస్ట్‌ షాట్‌ డన్‌’ అని కాజల్‌ పేర్కొన్నారు. భర్తతో కలిసి, విడిగా ఫొటోలు దిగిన ఆమె... ‘‘ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోండి. వీలైనంత త్వరగా, మీకు వీలైనప్పుడు వ్యాక్సినేషన్‌కు వెళ్లడం మరువకండి’’ అని విజ్ఞప్తి చేశారు. బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ సైతం శుక్రవారం వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. సల్మాన్‌ ఖాన్‌ బావ, హీరో ఆయుష్‌ శర్మ కూడా వ్యాక్సిన్‌ తొలి డోసు వేయించుకున్నారు.