Abn logo
Jul 9 2020 @ 23:39PM

సినిమా ఛారిటీ కాదు - కాజల్‌ అగర్వాల్‌

 ‘‘మంచి పాత్ర లభించి, అది కష్టంగా ఉంటుందనిపించినప్పుడు పారితోషికం విషయంలో కాస్త డిమాండ్‌గా ఉంటా. ఎందుకంటే సినిమా అనేది ఛారిటీ కాదు. నటన అంత సులభమూ కాదు. చెమటోడ్చి పని చేసినప్పుడు దానికి తగ్గ ప్రతిఫలం దక్కాల్సిందే’’ అని అంటున్నారు కాజల్‌. నిజమే! సినిమా ఛారిటీ కాదు. పక్కా వ్యాపారం. హీరో నుంచి టెక్నీషియన్ల వరకూ ఎవరూ తమ సంపాదన తగ్గించుకోవడానికి ఇష్టపడరు. అలాగని కాజల్‌ ఛారిటీలకు దూరం అనుకుంటే పొరపాటే. పారితోషికం చేతిలో పడ్డాక ఆమె ఎక్కువగా ఖర్చు చేసేది ఛారిటీలకే! అరకు ప్రాంతంలో గిరిజనుల కోసం కాజల్‌ ఓ స్కూల్‌ నడిపిస్తున్నారు. కుదిరిన ప్రతిసారీ అక్కడికి వెళ్లి ఆ స్కూల్లో చదివే విద్యార్థుల యోగ క్షేమాలు చూస్తారు. కానీ ఇవేమీ కాజల్‌ బయటకు తెలియనివ్వరు. ‘‘మనం చేసే పని అవసరార్థులకు ఉపయోగపడితే చాలు. ‘నేను ఫలానా వారికోసం ఇది చేశా.. అది చేశా అని డబ్బా కొట్టుకోవడం నాకు నచ్చదు. నిజంగానే నేను రెమ్యూనరేషన్‌ విషయంలో క్లారిటీగా ఉంటా. అలాగని చెత్త క్యారెక్టర్‌ ఇచ్చి డబ్బు ఆశ చూపితే.. అంగీకరించను’’ అని ఆమె తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement