Abn logo
Oct 24 2020 @ 09:36AM

కాజల్ భయపెడుతోంది!

Kaakateeya

వివాహం తర్వాత కూడా నటనను కొనసాగిస్తానని చందమామ కాజల్ అగర్వాల్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నెల 30న తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకోబోతున్న కాజల్ తొలిసారి ఓ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 


హారర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న `లైవ్ టెలీకాస్ట్` వెబ్ సిరీస్‌లో కాజల్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. తొలిసారి ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధమవుతోంది. వెంకట్ ప్రభు ఈ వెబ్ సిరీస్‌ను రూపొందిస్తున్నారు. త్వరలోనే డిస్నీ+హాట్ స్టార్‌లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌కు రానుంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ఫస్ట్‌లుక్‌ను కాజల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. 



Advertisement
Advertisement