Advertisement
Advertisement
Abn logo
Advertisement

దళిత నేతలపై అక్రమ కేసులను ఎత్తివేయాలి

కాకినాడలో అఖిలపక్షం డిమాండ్‌ 

భానుగుడి (కాకినాడ), డిసెంబరు 5: ప్రత్తిపాడు మం డలం చింతలూరు గ్రామంలో దళితులు, ప్రజాసంఘాల నేతలపై పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తి వేయాలని అఖిలపక్షం డిమాండ్‌ చేసింది. కాకినాడ కచేరీపేటలోని సుందరయ్య భవన్‌లో ఆదివారం అఖిలపక్ష సమావేశం జరిగింది. న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జె.వెంకటేశ్వర్లు, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు దువ్వా శేషబాబ్జి, మోర్త రాజశేఖర్‌, లిబరేషన్‌ జిల్లా నాయకుడు ఏగుపాటి అర్జునరావు, గొడుగు సత్యనారాయణ, చిన్నిబిల్లి నాగేశ్వరరావు, రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు వి.రాజబాబు, ఏఐకేఎంఎస్‌ జిల్లా అధ్యక్షుడు జనిపల్లి సత్తిబాబు, ఆర్పీఐ నాయకుడు అయితాబత్తుల రామేశ్వరరావు మాట్లా డారు. చింతలూరులో సీపీఐ ఎంఎల్‌ నాయకత్వంలో దళితులు, బీసీలు, ఇతర కులాల్లో నిరుపేదలు ఈనాం, ప్రభుత్వ భూముల్లో రెండు దశాబ్దాలుగా సాగు చేస్తున్నారని వారు చెప్పారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నాయకులు ఈ భూములను కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మైనింగ్‌ మాఫియా అధికార పార్టీ అండదండలతో ఈ భూములను ఆక్రమించుకుని మైనింగ్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. దీనికి వ్యతిరేకంగా శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుంటే వైసీపీ గూండాలు పెట్రోలు బాంబులతో, కర్రలతో కుక్కలను ఉసిగొల్పి దాడులు చేశారని ఆరోపించారు. లిబరేషన్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుగతా బంగార్రాజుతో పాటు 35 మందిపై అక్రమంగా కేసులు నమోదు చేశారన్నారు. ఈనెల 7న అఖిలపక్షం చింతలూరు గ్రామంలో పర్యటించి బాధితులతో మాట్లాడుతుందన్నారు. 13వ తేదీన కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తామని వారు తెలిపారు.

Advertisement
Advertisement