చెత్తను బహిరంగంగా వేయొద్దు

ABN , First Publish Date - 2021-10-23T04:57:40+05:30 IST

కార్పొరేషన్‌ (కాకినాడ), అక్టోబరు 22: నగరంలో చెత్తను బహిర్గతంగా వేయకుండా నగర ప్రజలు సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ స్వప్నిల్‌ దిన్‌కర్‌ విజ్ఞప్తి చేశారు. మునసబు జంక్షన్‌, ఆంధ్ర పాలిటెక్నిక్‌ కళాశాల రోడ్డు, బాలయోగి స్టాచ్చూ మహాలక్ష్మినగర్‌ ప్రాంతాల్లో శుక్రవారం ఆయ

చెత్తను బహిరంగంగా వేయొద్దు
నగరంలో చెత్తను పరిశీలిస్తున్న కమిషనర్‌ స్వప్నిల్‌

ప్రజలు సహకరించాలి

కమిషనర్‌ స్వప్నిల్‌ దిన్‌కర్‌ 

కార్పొరేషన్‌ (కాకినాడ), అక్టోబరు 22: నగరంలో చెత్తను బహిర్గతంగా వేయకుండా నగర ప్రజలు సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ స్వప్నిల్‌ దిన్‌కర్‌ విజ్ఞప్తి చేశారు. మునసబు జంక్షన్‌, ఆంధ్ర పాలిటెక్నిక్‌ కళాశాల రోడ్డు, బాలయోగి స్టాచ్చూ మహాలక్ష్మినగర్‌ ప్రాంతాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో వేసిన వ్యర్థాలను గుర్తించి అసహనం వ్యక్తం చేశారు. పారిశుధ్య కార్మికుల నుంచి సిబ్బంది అందరూ ప్రతిరోజూ పారిశుధ్యంపై నిబద్ధతతో పనిచేస్తుంటే ఇంకా కొందరు నగరవాసులు బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తున్నారన్నారు. తడి, పొడి చెత్తను విడదీసి ఇచ్చి ప్రజలు సహకరించాలన్నారు. పారిశుధ్య కార్మికులు మీ ఇంటికి రాకపోతే 18004250325 టోల్‌ఫ్రీ నెంబరులో సంప్రదించాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ పృథ్వీచరణ్‌, శానిటేషన్‌ ఇన్స్‌స్పెక్టర్‌, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 


మరింత పటిష్టంగా పారిశుధ్య నిర్వహణ 

కాకినాడ కార్పొరేషన్‌కు ఇద్దరు శానిటరీ సూపర్‌వైజర్లు రావడంతో పారిశుధ్య నిర్వహణ మరింత పటిష్టంగా నిర్వహించేందుకు వీలు కలిగిందని కమిషనర్‌ స్వప్నిల్‌ అన్నారు. నగరంలోని శారదాదేవి గుడివద్ద ఉన్న నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమిషనర్‌ చాంబర్లో పదోన్నతులు పొందిన శానిటరీ సూపర్‌వైజర్లకు ఆయన నియామకపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ జిలానీ, రాంబాబును అభినందించి పారిశుధ్యాన్ని మరింత పటిష్టంగా అమలుచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమం లో అదనపు కమిషనర్‌ నాగన రసింహారావు, ఎంహెచ్‌వో పృథ్వీ పాల్గొన్నారు.


Updated Date - 2021-10-23T04:57:40+05:30 IST