తుపాన్ల సమయంలో ముందస్తు అప్రమత్తత అవసరం

ABN , First Publish Date - 2021-11-27T05:23:22+05:30 IST

నడకుదురు (కరప), నవంబరు 26: తుపాన్లు, అధిక వర్షాలు సంభవించినపుడు ముందస్తు అప్రమత్తత చాలా అవసరమని కాకినాడ ఆర్డీవో ఏజీ చిన్నికృష్ణ అన్నారు. కరప మండలం నడకుదురులో శుక్రవారం ఆయన పర్యటించి తుపాన్ల సన్నద్ధత చర్యల్లో భాగంగా అవసరమైన ఎక్స్‌

తుపాన్ల సమయంలో ముందస్తు అప్రమత్తత అవసరం
నడకుదురులో తుపాను సన్నద్ధత చర్యలను పరిశీలిస్తున్న ఆర్డీవో చిన్నికృష్ణ

కాకినాడ ఆర్డీవో చిన్నికృష్ణ 

నడకుదురు (కరప), నవంబరు 26: తుపాన్లు, అధిక వర్షాలు సంభవించినపుడు ముందస్తు అప్రమత్తత చాలా అవసరమని కాకినాడ ఆర్డీవో ఏజీ చిన్నికృష్ణ అన్నారు. కరప మండలం నడకుదురులో శుక్రవారం ఆయన పర్యటించి తుపాన్ల సన్నద్ధత చర్యల్లో భాగంగా అవసరమైన ఎక్స్‌కవేటర్లు, ట్రాక్టర్లు, జనరేటర్ల నిర్వాహకులతో మాట్లాడారు. అత్యవసర సమయాల్లో వీరి సేవలు వెలకట్టేలేనివని, అందువల్ల ముందుగానే వారి వివరాలను నమోదు చేసుకుని అవసరానుగుణంగా వినియోగించుకోవాలని సూచించారు. తహశీల్దార్‌ పి.శ్రీనివాసరావు, ఆర్‌ఐ పేపకాయల మాచరరావు, ఆర్డీవో సీసీ సుబ్బారావు, వీఆర్‌వోలు ఎం.ఆదినారాయణ, భద్రిరాజు ఛంఢీ పాల్గొన్నారు.

Updated Date - 2021-11-27T05:23:22+05:30 IST