కలాకంద్‌

ABN , First Publish Date - 2021-10-02T18:24:51+05:30 IST

పాలు - రెండు లీటర్లు, నిమ్మరసం - రెండు టీస్పూన్లు, పంచదార - తగినంత, యాలకుల పొడి - ఒక టీస్పూన్‌, సీతాఫలం గుజ్జు - అర కప్పు, నెయ్యి - పావు కప్పు, పిస్తా - అరకప్పు, బాదం - నాలుగైదు పలుకులు.

కలాకంద్‌

కావలసినవి: పాలు - రెండు లీటర్లు, నిమ్మరసం - రెండు టీస్పూన్లు, పంచదార - తగినంత, యాలకుల పొడి - ఒక టీస్పూన్‌, సీతాఫలం గుజ్జు - అర కప్పు, నెయ్యి - పావు కప్పు, పిస్తా - అరకప్పు, బాదం - నాలుగైదు పలుకులు.


తయారీ విధానం: రెండు పాత్రల్లో లీటరు చొప్పున పాలు తీసుకుని మరిగించాలి. ఒక పాత్రలో పాలు సగానికి తగ్గే వరకు మరిగించుకుని పక్కన పెట్టుకోవాలి. ఒకపాత్రలో మరుగుతున్న పాలల్లో నిమ్మరసం వేయాలి. దాంతో పాలు విరిగిపోతాయి. ఇప్పుడు స్టవ్‌పై నుంచి దింపి కాటన్‌ క్లాత్‌ సహాయంతో వడబోసి పనీర్‌ వేరు చేసుకోవాలి. ఈ పనీర్‌ను సగానికి మరిగించి పెట్టుకున్న పాలల్లో కలుపుకోవాలి. మళ్లీ స్టవ్‌పై పెట్టి మరిగించాలి. పంచదార వేసి మరో రెండు నిమిషాలు ఉడికించాలి. యాలకుల పొడి వేయాలి. సీతాఫలం గుజ్జు వేసి కలపాలి. ఒక ప్లేట్‌కు నెయ్యి రాసి మిశ్రమాన్ని సమంగా పోయాలి. పిస్తా, బాదం పలుకులతో గార్నిష్‌ చేసుకోవాలి. చల్లారిన తరువాత ముక్కలుగా కట్‌ చేసి సర్వ్‌ చేసుకోవాలి.


Updated Date - 2021-10-02T18:24:51+05:30 IST