Abn logo
Oct 21 2020 @ 23:43PM

కళాపోషకులు....

Kaakateeya

విశ్వకార్తికేయ, దీపా ఉమావతి జంటగా... నటుడు ‘జెమిని’ సురేశ్‌ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కళాపోషకులు’. బుధవారం ఈ సినిమా టీజర్‌ విడుదల చేశారు. ‘‘ప్రేమకథతో పాటు కుటుంబ విలువలు, భావోద్వేగాలతో చిత్రాన్ని తెరకెక్కించాం. ‘ఆ నలుగురు’లో బాలనటుడిగా చేసిన విశ్వ కార్తికేయ ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు’’ అని చిత్రదర్శకుడు చలపతి పువ్వల చెప్పారు. ‘‘కథకు విశ్వ కార్తికేయ పర్‌ఫెక్ట్‌ ఛాయిస్‌. కల్యాణ్‌ సమి ఛాయాగ్రహణం, ఎలెందర్‌ మహావీర్‌ సంగీతం చిత్రానికి అదనపు ఆకర్షణలు’’ అని నిర్మాత ఎం. సుధాకర్‌రెడ్డి అన్నారు. ‘జెమిని’ సురేశ్‌, గేయ రచయిత రాంబాబు గోసాల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement
Advertisement