హుందాగా వ్యవహరించాలి

ABN , First Publish Date - 2021-07-30T06:00:04+05:30 IST

ప్రజాస్వామ్యంలో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తులు జాగ్రత్తగా మాట్లాడాలనీ, హుం దాగా వ్యవహరించాలని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు వ్యాఖ్యానించారు.

హుందాగా వ్యవహరించాలి

విప్‌నకు కాలవ హితవు

రాయదుర్గం, జూలై 29: ప్రజాస్వామ్యంలో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తులు జాగ్రత్తగా మాట్లాడాలనీ, హుం దాగా వ్యవహరించాలని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. గురువారం ఉదయం పట్టణంలోని తన నివాసంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విప్‌ పదవిలో ఉన్న కాపు రామచంద్రారెడ్డి స్థాయి మరచి సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. విలేఖరులు రాయలేనివి, చానళ్లలో చూపించలేని నీచ భాషలో మాట్లాడటం సరికాదన్నారు. తన రాజకీయ జీవితంలో కాపు రామచంద్రారెడ్డి లాంటి సభ్యత, సంస్కారం లేని వ్యక్తిని ఎన్నడూ చూడలేదన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న ఐదేళ్లలో హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి, అత్యవసర పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టామన్నారు. వైసీపీ రెండేళ్ల పాలనలో హెచ్చెల్సీని పట్టించుకోలేదన్నారు. ఇన్నిరోజులు పట్టనట్లు ఉండి, నీరు వదిలేటపుడు పనులు ప్రారంభించడం ఏంటని ప్రశ్నించారు. విప్‌ కాపు నిర్లక్ష్యం వల్లే హెచ్చెల్సీ నీరు ఏట్లోకి వదలాల్సి వస్తోందన్నారు. రైతు పక్షపాతి ప్రభుత్వమని చెప్పుకునే కాపునకు హెచ్చెల్సీ ఆయకట్టు రైతుల మీద ఏ మాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. పనికిమాలిన పనిని కూడా బలంగా సమర్థించుకోవడం ఆయనకే సాధ్యమన్నారు. అందుకు ఏటి పాలైన నీళ్ల వ్యవహారమే నిదర్శనమన్నారు. తాను రూ.4500 కోట్లతో రాయదుర్గాన్ని అభివృద్ధి చేశాననీ, చేతనైతే దానికన్నా ఎక్కువ నిధులు తెచ్చి, పోటీగా అభివృద్ధి చేయాలని విప్‌నకు సవాల్‌ విసిరారు. రెడ్‌క్రాస్‌ సంస్థ పేరు చెప్పి, బలవంతంగా వ్యాపారుల నుంచి లక్షల సొమ్ము వసూలు చేసి, బ్రహ్మణి సొసైటీకి మ ళ్లించడం నిజం కాదా అని ప్రశ్నించారు. ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకుంటున్న వారిని బెదిరించిన ఘటనలు ఉన్నాయన్నారు. ఏదో ఒకరోజు వాటన్నింటినీ బయటపెడతానన్నారు.  స మావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు పసుపులేటి నాగరాజు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన కడ్డిపూడి మహబూబ్‌ బాషా, మాజీ కౌన్సెలర్‌ టంకశాల హనుమంతు, మార్కెట్‌ యార్డు మాజీ ఉపాధ్యక్షుడు బంగి శంకర్‌, సిమెంటు శీనా పాల్గొన్నారు.



Updated Date - 2021-07-30T06:00:04+05:30 IST