యాసంగికి సాగునీరు పుష్కలం

ABN , First Publish Date - 2020-02-28T11:54:30+05:30 IST

భూగర్భజలాలు ఉబికి వస్తున్నాయి. యాసంగి సాగుకు నీటి ఇబ్బంది లేకపోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

యాసంగికి సాగునీరు పుష్కలం

గోదావరి జలాలతో మానేరుకు 18 కిలోమీటర్ల మేర జలకళ

వేసవిలో నీటి వృథాను అరికడితే ఎంతో ప్రయోజనం

చందుర్తిలో 2.70 మీటర్ల లోతులోనే నీళ్లు

జిల్లాలో రబీసాగు 1,12,646 ఎకరాలు 


 (ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల): భూగర్భజలాలు ఉబికి వస్తున్నాయి. యాసంగి సాగుకు నీటి ఇబ్బంది లేకపోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో గోదావరి జలాలు సిరిసిల్ల మానేరు చెంత కు చేరాయి. గతేడాది కురిసిన వర్షాల కారణంగా చెరువులు, కుంటల్లోకి నీళ్లు చేరాయి. వేములవాడ, చందుర్తి ప్రాంతంలో ఎల్లంపల్లి నీటిని చెరువుల్లోకి నింపారు. గోదావరి జలాలతో సిరిసిల్ల మానేరు వాగు లో జలకళ వచ్చింది. మిడ్‌మానేరులో సామర్థ్యానికి సరిపడా గోదావరి నీటిని నింపడంతో భూగర్భ జలా లు జీవం పోసుకున్నాయి. 


జిల్లాలో గతేడాది జనవరితో పోల్చుకుంటే భూగర్భ జలాలు స్థిరంగా ఉండడంతో వ్యవసాయ బోరుబావు లు నీటితో కళకళలాడుతూ రైతుల్లో ఆశలు పెంచు తున్నాయి. వేసవిలో భూగర్భ జలాలను పొదుపుగా వాడుకుంటే సాగు, తాగునీరుకు ఎలాంటి ఇబ్బందు లు ఉండవని భావిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో సరాసరిగా 8.18 మీటర్ల లోతులో నీళ్లు ఉన్నాయి. గత సంవత్సరం వేసవి మేలో 17.98 మీటర్ల లోతులోకి నీళ్లు పడిపోయాయి. వర్షాలు అనుకూలంగా కురవ డంతో వ్యవసాయ బోర్లు, బావుల్లో నీటిమట్టం పెరి గింది. వర్షాకాలం సీజన్‌లో 831.9 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికి 11.89 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీంతో జిల్లాలోని అన్ని మండలాల్లో భూగర్భజలాలు పెరిగాయి. సరాసరిగా 2.70 మీటర్ల లోతులోనే నీరు లభ్యమయ్యే స్థాయికి చేరుకున్నాయి. చందుర్తిలో 2.70 మీటర్ల లోతులో నీటి మట్టం ఉంది. భూగర్భ జలాల మట్టం స్వల్పంగా 1.81 మీటర్లకు పడిపోయింది. మిడ్‌మానేరులో 24 టీఎంసీల నీటిని నింపడంతో బ్యాక్‌వాటర్‌ మానేరు, మూలవాగులతో పాటు 18 కిలోమీటర్ల మేరకు జలకళ సంతరిం చుకుంది. బ్యాక్‌ వాటర్‌తోనే భూగర్భ జలాలు స్థిరం గా ఉన్నట్లు భావిస్తున్నారు. రబీసాగుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 


జిల్లాలో 1,12,646 ఎకరాల్లో సాగు 

 జిల్లాలో రైతులు రబీ సాగు అంచనాకు మించి పెంచుకున్నారు. రబీసాగు లక్ష్యం 1,03,723 పెట్టుకో గా 1,12,646 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. జిల్లాలో భూగర్భ జలాల మట్టం పెరగడంతో వరి వైపు మొగ్గుచూపారు. వరి 1,10,979 ఎకరాల్లో సాగు చేస్తే మొక్కజొన్న 957 ఎకరాలు, పెసర 98 ఎకరాలు, కందులు 562 ఎకరాలు, పల్లి 50 ఎకరాల్లో సాగు చేశారు. ఇందుకు అవసరమైన విత్తనాలు కూడా సబ్సిడీలో అందించారు. 


జిల్లాలో పెరిగిన భూగర్భ జలాల వివరాలు (మీటర్లలో)

మండలం మే నెలలో       ప్రస్తుతం

బోయినపల్లి 9.84 3.72

చందుర్తి 9.16 2.70

గంభీరావుపేట 19.15 10.03

ఇల్లంతకుంట 17.20 6.80

కోనరావుపేట 16.86 8.00

ముస్తాబాద్‌ 24.65 11.47

రుద్రంగి 11.34 7.06

సిరిసిల్ల 19.13 11.04

తంగళ్లపల్లి 15.21 7.39

వీర్నపల్లి 14.48 9.43

వేములవాడ రూరల్‌ 4.70 3.1

వేములవాడ 27.40. 9.41

ఎల్లారెడ్డిపేట 25.47 8.18


జిల్లా సగటున   17.98 8.18


జిల్లాలో సాగు విస్తీర్ణం ఎకరాలలో.. 

మండలం       సాగువిస్తీర్ణం

సిరిసిల్ల 2688

వీర్నపల్లి 4927

ఎల్లారెడ్డిపేట 11026

గంభీరావుపేట 13207

ముస్తాబాద్‌ 11961

తంగళ్లపల్లి 12439

ఇల్లంతకుంట 13867

వేములవాడ అర్బన్‌ 3649

వేములవాడ 7951

చందుర్తి 7125

రుద్రంగి 3079

కోనరావుపేట 9516

బోయినపల్లి 11210

మొత్తం 112646


Updated Date - 2020-02-28T11:54:30+05:30 IST