45రోజుల్లో మిడ్‌ మానేర్‌ కుడికాలువ పనులు పూర్తి చేస్తాం

ABN , First Publish Date - 2020-06-02T09:42:29+05:30 IST

జిమిడ్‌మానేర్‌ కుడికాలువ పనులను 45 రోజుల్లో పూర్తి చేసి, జిల్లాలోని మెట్ట ప్రాంతాలకు పూర్తిస్థాయిలో కాళేశ్వరం నీళ్లు అందింస్తామని రాష్ట్ర వైద్య

45రోజుల్లో మిడ్‌ మానేర్‌ కుడికాలువ పనులు పూర్తి చేస్తాం

మెట్ట ప్రాంతాలు కాళేశ్వరం నీళ్లతో సస్యశ్యామలం

మంత్రి ఈటల రాజేందర్‌


సైదాపూర్‌, జూన్‌ 1: జిమిడ్‌మానేర్‌ కుడికాలువ పనులను 45 రోజుల్లో పూర్తి చేసి, జిల్లాలోని మెట్ట ప్రాంతాలకు పూర్తిస్థాయిలో కాళేశ్వరం నీళ్లు అందింస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. సోమవారం సైదాపూర్‌ మండలంలోని దుద్దెనపల్లి, పెర్కపల్లి, ఘణపూర్‌, ఆకునూర్‌, ఎక్లాస్‌పూర్‌ గ్రామాల్లోని కాలువ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు మండలాల్లోని మిడ్‌మానేర్‌ కుడికాలువ పనులకు 30 కోట్ల నిధులను విడుదల చేశామన్నారు. బొమ్మకల్‌ గ్రామంలోని పెద్ద చెరువుకు త్వరలోనే కాళేశ్వరం నీళ్లు చేరుతాయన్నారు.


దుద్దెనపల్లి గ్రామంలో మంత్రి ఈటల రాజేందర్‌కు సైదాపూర్‌ ఫీల్డ్‌ అసిస్టెంట్లు తమను విధుల్లోకి చేర్చుకోవాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, సుడా చైర్మన్‌ రామకృష్ణారావు, ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్‌రెడ్డి, సింగిల్‌ విండో చైర్మన్లు బిల్లా వెంకట్‌రెడ్డి, కొత్త తిరుపతిరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు సోమారపు రాజయ్య, హుజూరాబాద్‌ ఆర్డీవో బెన్‌షాలేమ్‌, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-02T09:42:29+05:30 IST