కాలువ ఇలా.. సాగు ఎలా ?

ABN , First Publish Date - 2021-05-07T03:18:18+05:30 IST

: వందలాది ఎకరాలకు సాగునీరు అందించే కలుజు కాలువలో పూడిక తీయాల్సిందిగా కోవూరు, పాటూరు రైతులు కోరుతున్నారు. కోవూరు చెరువు నుంచి సా

కాలువ ఇలా.. సాగు ఎలా ?
బుడగ తామరతో నిండిఉన్న కలుజు కాలువ

కోవూరు, మే6 : వందలాది ఎకరాలకు సాగునీరు అందించే కలుజు కాలువలో పూడిక తీయాల్సిందిగా కోవూరు, పాటూరు రైతులు కోరుతున్నారు. కోవూరు చెరువు నుంచి సాగునీరు అందించే కలుజు కాలువ పూర్తిగా పిచ్చి చెట్లు, బుడగతామరతో నిండిపోయింది. దీంతో లోతట్టు ప్రాంత రైతులు సాగునీరందక ఇబ్బందులకు గురవుతున్నారు.మరో వారం రోజుల్లో ఎడగారు వరినాట్లు వేయాల్సి ఉంది. కాలువ పూడిక తీయకపోతే సకాలంలో వరినాట్లు వేయలేమని  రైతులు వాపోతున్నారు.  నీటిపారుదల శాఖాధికారులు స్పందించి కాలువలో పూడిక తీయించాల్సిందిగా వారు కోరుతున్నారు.

Updated Date - 2021-05-07T03:18:18+05:30 IST