పరిసరాల శుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం

ABN , First Publish Date - 2020-05-11T10:34:55+05:30 IST

పరిసరాల శుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావు అన్నారు.

పరిసరాల శుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం

 కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావు

మెట్‌పల్లి, మే 10: పరిసరాల శుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావు అన్నారు. ఆదివారం రాష్ట్ర పురపాలక శాఖ ఆద్వర్యంలో చేపట్టిన ‘ప్రతీ ఆదివారం 10 గంటల 10 నిమిషాలకు’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని తన నివాస పరిసరాల్లో గల పూల కుండీలు, ఇతర చోట్ల నిలువ ఉన్న నీటి నిల్వలను పరిశీలించి తొలగించారు. పూల కుండీల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించి యాంటి లార్వా మందులు చల్లారు. వర్షాకాలం నాటికి సీజనల్‌ వ్యాదుల నివారణ కొరకు ప్రతీ ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Updated Date - 2020-05-11T10:34:55+05:30 IST