Abn logo
Sep 23 2021 @ 01:17AM

ఆడబిడ్డల తల్లిదండ్రులకు కల్యాణలక్ష్మీ వరం

కల్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌

- ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌

బీర్‌పూర్‌,సెప్టెంబరు 22 : ఆడబిడ్డల తల్లిదండ్రులకు కల్యాణలక్ష్మీ పథకం వరం అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ అన్నారు. బుధవారం బీర్‌పూర్‌ మండలంలోని రైతువేదిక భవణంలో ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీకి ఆయన ముఖ్య అథితిగా హాజరయ్యరు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి  పాటుపడుతున్నారని అన్నారు. కుల మత భేదం లేకుండా కల్యాణలక్ష్మీ పథ కం అమలు చేస్తున్నారని ఆడబిడ్డల తల్లిదండ్రులకు ఈ పథకంతో ఎంతో ఊరట లభిస్తుందని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో లేని ఎన్నో పథకాలను  అమలు చేస్తున్నారని అన్నారు. అనంతరం  మండలంలోని 31 మంది ఆడ బిడ్డలకు కల్యాణలక్ష్మీ ద్వారా మంజూరైన 31లక్షల 3వేల 596 రూపాయల విలువలగల చెక్కులను ఎమ్మెల్యే తన చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మసర్తి రమేష్‌, కేడీసీసీ మెంబర్‌ ముప్పాల రాంచందర్‌రావు, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు మహిపాల్‌ రెడ్డి, పీఏసీఎస్‌ చెర్మెన్‌ నవీన్‌రావ్‌, స్థానిక సర్పంచ్‌ గర్షకుర్తి శిల్ప రమేష్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు నారపాక రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. కల్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ (