Abn logo
Oct 21 2021 @ 22:10PM

పేదలను ఆదుకునేందుకే కల్యాణలక్ష్మి

చెక్కులను పంపిణీ చేస్తున్న జడ్పీ వైస్‌ చైర్మన్‌ కోనేరు కృష్ణారావు

- జడ్పీ వైస్‌ చైర్మన్‌ కోనేరు కృష్ణారావు

సిర్పూర్‌(టి), అక్టోబరు 21: పేద కుటుం బాలను ఆదుకోవాలనే లక్ష్యంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను ప్రభుత్వం ప్రారం భించిందని జడ్పీ వైస్‌ చైర్మన్‌ కోనేరు కృష్ణారావు అన్నారు. గురువారం మండలం లోని 31మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. పథకాలకు దరఖాస్తు చేయడంలో మధ్య దళారులను ఆశ్రయించ వద్దన్నారు. ఎంపీపీ సువర్ణ, జిల్లా కోఆప్షన్‌ సభ్యుడు సిద్ధిక్‌ అహ్మద్‌, మండల కో ఆప్షన్‌ సభ్యుడు కీజర్‌హుస్సేన్‌, ఎంపీటీసీలు తదితరులు ఉన్నారు.