కల్యాణ వెంకన్న దర్శనం పునఃప్రారంభం

ABN , First Publish Date - 2021-06-17T07:12:31+05:30 IST

చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలో వెలసిన కల్యాణ వేంకటేశ్వరస్వామి దర్శనం బుధవారం నుంచి పునఃప్రారంభమైంది.

కల్యాణ వెంకన్న దర్శనం పునఃప్రారంభం

చంద్రగిరి, జూన్‌ 16:చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలో వెలసిన కల్యాణ వేంకటేశ్వరస్వామి దర్శనం బుధవారం నుంచి పునఃప్రారంభమైంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏప్రిల్‌ 16న ఆర్కియాలజీ శాఖ ఆదేశాల మేరకు స్వామివారి దర్శనాలను రద్దు చేశారు. స్వామివారికి నిత్య కైంకర్యాలు, ఉత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తూ వచ్చారు. ఆర్కియాలజీ శాఖ అధికారులు తాజాగా భక్తులకు స్వామి దర్శనం కల్పించాలని ఉత్తర్వులు జారీ చేయడంతో బుధవారం నుంచి ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కొవిడ్‌-19 నిబంధనల ప్రకారం స్వామి దర్శనం ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. 


చంద్రగిరి కోట సందర్శన కూడా....

 చంద్రగిరిలోని రాయలవారి కోట సందర్శనకు బుధవారం నుంచి పర్యాటకులను అనుమతిస్తున్నారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఏప్రిల్‌ 16నుంచి కోటను మూసివేయాలని ఆర్కియాలజీ శాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.బుధవారం నుంచి చంద్రగిరి కోటను, మ్యూజియాన్ని పర్యాటకుల సందర్శనకు అనుమతించవచ్చని ఆర్కియాలజీ శాఖ సూచించడంతో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పర్యాటకులను అనుమతించనున్నారు. 

Updated Date - 2021-06-17T07:12:31+05:30 IST