Abn logo
Oct 18 2021 @ 12:21PM

బీజేపీ నేత Kalyanaraman‌ అరెస్టు

చెన్నై/ప్యారీస్: సోషల్‌ మీడియా వేదికగా వరుసగా రాజకీయనేతలు, మహిళలను కించపరిచేలా అభిప్రాయాలు ప్రచారం చేసిన బీజేపీ ప్రముఖుడు కల్యాణరామన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిల కీర్తిప్రతిష్టతలకు భంగం కలిగించే విధంగా కల్యాణరామన్‌ తన ట్విట్టర్‌ పేజీలో అభిప్రాయాలు నమోదు చేశారు. అంతకు ముందు సినీ నటి డాక్టర్‌ షర్మిలను కించపరిచారు. దీంతో ఆయనను అరెస్టు చేయాలని ధర్మపురి డీఎంకే ఎంపీ సెంథిల్‌కుమార్‌ సహా పలువురు చెన్నై సైబర్‌ క్రైం పోలీసు విభాగంలో ఫిర్యాదు చేశారు. అదేవిధంగా స్థానిక తండయార్‌పేటకు చెందిన గోపినాథ్‌ అనే న్యాయవాది అందజేసిన ఫిర్యాదు ఆధారంగా కల్యాణరామన్‌పై ఐపీసీ 153 (ఏ), 505 (2) అనే సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదుచేశారు. దీంతో వలసరవాక్కం దేవికుప్పం అన్బునగర్‌ ప్రాంతంలో నివసిస్తున్న కల్యాణరామన్‌ను శనివారం అర్ధరాత్రి కేంద్ర నేరవిభాగం పోలీసులు అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండిImage Caption