ఎన్నికల్లో నేనూ పోటీ చేస్తా.. : కమల్‌

ABN , First Publish Date - 2021-01-14T16:32:51+05:30 IST

ఎన్నికల్లో నేనూ పోటీ చేస్తా.. : కమల్‌

ఎన్నికల్లో నేనూ పోటీ చేస్తా.. : కమల్‌

చెన్నై : రాష్ట్ర అసెంబ్లీకి జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తానూ పోటీచేయనున్నట్టు మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధ్యక్షుడు, నటుడు కమల్‌హాసన్‌ స్పష్టం చేశారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కోయంబత్తూర్‌ ప్రాంతంలో మూడు రోజుల రోడ్‌షో చేపట్టిన కమల్‌హాసన్‌ బుధవారం మీడియాతో మాట్లాడారు. ఎంఎన్‌ఎం తరఫున చేపట్టిన ఐదు విడతల ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన రావడంపై సంతోషంగా ఉందన్నారు. 


ప్రజల అవసరాలు తీర్చే విధంగా రూపొందించిన పథకాల గురించి ప్రజలకు వివరిస్తున్నామని, ప్రస్తుతం వృత్తి రంగానికి సంబం ధించిన ఏడు హామీలతో ప్రచారం సాగిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో పొత్తు కుదుర్చుకోవడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, తమ పార్టీ సిద్ధాంతాలతో ఏకీభవించే చిన్న పార్టీలతో చేతులు కలపడంపై త్వరలో పార్టీ నిర్వాహకులతో చర్చించనున్నట్టు కమల్‌హాసన్‌ తెలిపారు.

Updated Date - 2021-01-14T16:32:51+05:30 IST