చెన్నై, మార్చి 1(ఆంధ్రజ్యోతి): తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ నేతృత్వంలోని ‘అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం’(ఏఎంఎంకే) పార్టీని తమ కూటమిలో చేర్చుకునేందుకు ‘మక్కల్ నీది మయ్యం అధినేత కమల్‌హాసన్ నిరాకరించారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న తాను, అవినీతి కేసులో జైలుశిక్ష అనుభవించిన శశికళ బృం దాన్ని పక్కనపెట్టుకుని ఎలా ప్రచారం చేయగలనంటూ నిరాసక్తత వ్యక్తం చేసినట్టు తెలిసింది. మరోవైపు శరత్‌కుమార్, ఏఎంఎంకే నేత, శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ కమల్‌ను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.