Abn logo
Sep 24 2021 @ 17:50PM

ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి : కమల హారిస్

వాషింగ్టన్ : ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యానికి ఎదురవుతున్న ముప్పుపై అమెరికా ఉపాధ్యక్షురాలు కమల హారిస్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్, అమెరికాలలోని ప్రజాస్వామిక సిద్ధాంతాలను, వ్యవస్థలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కలిసి ఆమె సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు. 


తన కార్యాలయానికి ప్రధాని మోదీని స్వాగతం పలుకుతూ, ఆయనను ఉద్దేశించి కమల హారిస్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం ముప్పును ఎదుర్కొంటున్నందువల్ల, మన దేశాల్లోనూ, ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామిక సిద్ధాంతాలను, వ్యవస్థలను కాపాడుకోవడం తప్పనిసరి అని చెప్పారు. దేశీయంగా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి చేయవలసినదంతా తప్పనిసరిగా చేయాలన్నారు. ఇరు దేశాల ప్రజల ఉత్తమ ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ఉభయ దేశాలపై ఉందన్నారు. 


ప్రజాస్వామ్యం పట్ల భారతీయుల నిబద్ధత గురించి తనకు తన వ్యక్తిగత అనుభవం, తన కుటుంబం ద్వారా తెలుసునని చెప్పారు. ప్రజాస్వామిక సిద్ధాంతాలు, వ్యవస్థల కోసం కలలు కనడం ప్రారంభించేందుకు, వాటిని వాస్తవంగా సాధించేందుకు మనం కృషి చేయాలన్నారు. 


ఇవి కూడా చదవండిImage Caption