క‌మ‌లా హారిస్‌పై ట్రంప్ మ‌రోసారి తీవ్ర వ్యాఖ్య‌లు !

ABN , First Publish Date - 2020-08-15T18:45:22+05:30 IST

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ డెమొక్ర‌టిక్ పార్టీ త‌ర‌ఫున ఉపాధ్య‌క్ష రేసులో ఉన్న‌ భార‌త సంత‌తి మ‌హిళ క‌మ‌లా హారిస్‌పై మ‌రోసారి తీవ్ర వ్యాఖ్య‌ల‌తో విర‌చుకుప‌డ్డారు.

క‌మ‌లా హారిస్‌పై ట్రంప్ మ‌రోసారి తీవ్ర వ్యాఖ్య‌లు !

వాషింగ్ట‌న్ డీసీ: అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ డెమొక్ర‌టిక్ పార్టీ త‌ర‌ఫున ఉపాధ్య‌క్ష రేసులో ఉన్న‌ భార‌త సంత‌తి మ‌హిళ క‌మ‌లా హారిస్‌పై మ‌రోసారి తీవ్ర వ్యాఖ్య‌ల‌తో విర‌చుకుప‌డ్డారు. శుక్ర‌వారం మీడియాతో మాట్లాడిన ట్రంప్‌... అధ్యక్ష అభ్య‌ర్థి జో బిడెన్ కంటే క‌మ‌లా హారిస్ అధ్వానం అన్నారు. ఆమె భారతీయ వారసత్వానికి చెందిన మ‌హిళ అంటూ నొక్కి చెప్పారు. ఆమె కంటే నాకు ఎక్కువ మంది భారతీయులు ఉన్నారని తెలిపారు. ఒక‌వేళ బిడెన్ అమెరికా అధ్యక్షుడైతే అది దేశానికి ఎంతో చెడు అని ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. 


"జో బిడెన్ అధ్యక్షుడైతే అతను వెంటనే అమెరికాలోని ప్రతి పోలీసు విభాగాన్ని అరికట్టడానికి చట్టాన్ని ఆమోదిస్తాడు. కమలా ఇంకా అధ్వాన్నంగా ఉంది. ఆమె భారతీయ వారసత్వానికి చెందినది. నాకు ఆమె కంటే ఎక్కువ మంది భారతీయులు ఉన్నారు." అని అన్నారు. "ఆమె ఇప్పటివరకు అందరికంటే బిడెన్‌తో దారుణంగా ప్రవర్తించింది. పోకాహొంటాస్‌తో సహా ఎవ్వరూ కూడా బిడెన్‌ను కమలాగా తీవ్రంగా చూడలేదు." అని పేర్కొన్నారు. ఇంత‌కుముందు కూడా క‌మ‌లాను భ‌యంక‌ర‌మైన వ్య‌క్తి అంటూ ట్రంప్ వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. 


ఇక డెమొక్రాటిక్ ప్రెసిడెంట్ అభ్యర్థి జో బిడెన్ ఒక భారతీయ-అమెరికన్, ఆఫ్రికన్-అమెరికన్ 55 ఏళ్ల కమలా హారిస్‌ను నవంబర్ 3న జరగనున్న 2020 యూఎస్ ఎన్నికలకు తన ఉపాధ్య‌క్ష అభ్య‌ర్థిగా నామినేట్ చేసి చరిత్ర సృష్టించారు. కాలిఫోర్నియా సెనేటర్ అయిన క‌మ‌లా హారిస్ జమైకన్‌ తండ్రి, ఇండియ‌న్‌ తల్లికి జన్మించారు.


Updated Date - 2020-08-15T18:45:22+05:30 IST