రెండు నెలల నిరీక్షణకు తెర.. అధికార నివాసంలోకి కమలా హారిస్!

ABN , First Publish Date - 2021-04-08T22:55:11+05:30 IST

అమెరికా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన దాదాపు నెలల తర్వాత.. కమలా హారిస్ తన అధికార నివాసంలోకి వెళ్లబోతున్నారు. ఈ వారంలో ఆమె తన భర్త డగ్ ఎమ్హోఫ్‌తోపాటు ఉపాధ్యక్షల కోసం కేటాయించిన

రెండు నెలల నిరీక్షణకు తెర.. అధికార నివాసంలోకి కమలా హారిస్!

వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన దాదాపు నెలల తర్వాత.. కమలా హారిస్ తన అధికార నివాసంలోకి వెళ్లబోతున్నారు. ఈ వారంలో ఆమె తన భర్త డగ్ ఎమ్హోఫ్‌తోపాటు ఉపాధ్యక్షల కోసం కేటాయించిన భవన (నావల్ అబ్జర్వేటరీ)లోకి మారనున్నారు. నావల్ అబ్జర్వేటరీలో ప్లంబింగ్, హీటింగ్, ఎయిర్ కండిషనింగ్‌కు సంబంధించిన మరమ్మతులు జరిగిన కారణంగా.. రెండు నెలలపాటు ఆమె తన భర్తతో కలిసి అమెరికా అధ్యక్షుడి అధికార అతిథి గృహం(బ్లెయిర్ హౌస్)లో నివసించారు. నావల్ అబ్జర్వేటరీలో మరమ్మతులు పూర్తైన నేపథ్యంలో కమలా హారిస్.. ఈ వారంలో తన అధికార నివాసంలోకి మారబోతున్నారు. కాగా.. ఈ ఏడాది జనవరి 20న అమెరికా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన కమలా హారిస్.. ఆ పదవిని చేపట్టిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 


Updated Date - 2021-04-08T22:55:11+05:30 IST