న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌.. తళుక్కుమన్న కమలా పెంపుడు కూతురు

ABN , First Publish Date - 2021-02-19T16:37:21+05:30 IST

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ పెంపుడు కూతురు ఎల్లా ఎమ్హాఫ్ న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో తళుక్కుమన్నారు.

న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌.. తళుక్కుమన్న కమలా పెంపుడు కూతురు

న్యూయార్క్: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ పెంపుడు కూతురు ఎల్లా ఎమ్హాఫ్ న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో తళుక్కుమన్నారు. గురువారం తన తొలి ర్యాంప్ వాక్‌తో ఆమె అదరగొట్టారు. ఇక తొలిసారి క్యాట్ వాక్ చేయబోతున్న ఆనందంలో ముందురోజు రాత్రి సరిగ్గా నిద్ర కూడా పట్టలేదని ఎల్లా చెప్పుకొచ్చారు. కాగా, అమెరికా అధ్యక్ష ప్రమాణస్వీకారోత్సవంలో కూడా ఆమె ప్రత్యేక్ష ఆకర్షణగా నిలిచారు. ఆమె ధరించిన మియు మియు కోటు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ కార్యక్రమం తర్వాత కొన్ని రోజులకే ఐఏంజీ మోడల్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎల్లా తెలిపారు. 

Updated Date - 2021-02-19T16:37:21+05:30 IST