ఈ ఎన్నికల్లోనైనా Kamal ఆశ తీరేనా?

ABN , First Publish Date - 2022-02-04T16:18:16+05:30 IST

కోయంబత్తూర్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధుల తరఫున మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధ్యక్షుడు కమల్‌ హాసన్‌ రెండు రోజులు ప్రచారం చేయనున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో కోవై

ఈ ఎన్నికల్లోనైనా Kamal ఆశ తీరేనా?

పెరంబూర్‌(చెన్నై): కోయంబత్తూర్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధుల తరఫున మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధ్యక్షుడు కమల్‌ హాసన్‌ రెండు రోజులు ప్రచారం చేయనున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో కోవై దక్షిణం నియోజకవర్గంలో పోటీచేసిన ఎంఎన్‌ఎం అధ్యక్షుడు కమల్‌ హాసన్‌, నెల రోజులు అక్కడే మకాం వేసి నగరవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేపట్టిన ప్రచారానికి ప్రజలు నుంచి స్పందన వచ్చింది. అయినా, 1,500 ఓట్ల తేడాతో ఆయన పరాజయం పాలయ్యారు. వార్డులు, బూత్‌ల వారీగా పోలైన ఓట్ల వివరాలను పార్టీ నిర్వాహకులు గణించగా, కొన్ని బూత్‌ల్లో మాత్రమే రెండో స్థానంలో నిలిచినట్లు గుర్తించారు. దీంతో, ప్రస్తుత ఎన్నికల్లో కోవై కార్పొరేషన్‌లో మెజార్టీ స్థానాలు చేజిక్కించుకు వాలని పార్టీ పావులు కదుపుతోంది. ప్రస్తుతం కార్పొరేషన్‌ పరిధిలోని 100 వార్డుల్లో  77 చోట్ల ఎంఎన్‌ఎం అభ్యర్ధులను ప్రకటించింది. ఈ విషయమై పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తంగవేల్‌ మాట్లాడుతూ, శాసనసభ ఎన్నికల్లో కూటమి పార్టీల మద్దతుతో సల్ప తేడాతో బీజేపీ విజయం సాధించిందని, ప్రస్తుతం ఆ పార్టీ ఒంటరిగా పోటీచేస్తుందన్నారు. కోవై దక్షిణం నియోజకవర్గం పరిధిలో 12 వార్డులున్నాయని, 10 వార్డుల్లో తప్పక విజయం సాధిస్తామని నమ్మకం వ్యక్తం చేశారు. పార్టీ అభ్యర్ధులకు మద్దతుగా కమల్‌హాసన్‌ రెండు రోజులు ప్రచారం చేపడతారని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2022-02-04T16:18:16+05:30 IST