కమనీయం సింహాద్రి అప్పన్న కళ్యాణం

ABN , First Publish Date - 2021-10-25T05:42:11+05:30 IST

వరాహ లక్ష్మీనృసింహస్వామి నిత్య కళ్యాణాన్ని ఆదివారం కన్నులపండువగా నిర్వహించారు.

కమనీయం సింహాద్రి అప్పన్న కళ్యాణం
కళ్యాణం నిర్వహిస్తున్న అర్చకుడు

సింహాచలం, అక్టోబరు 24: వరాహ లక్ష్మీనృసింహస్వామి నిత్య కళ్యాణాన్ని ఆదివారం కన్నులపండువగా నిర్వహించారు. ఆలయంలో జరిగే ఆర్జిత నిత్య కళ్యాణంలో భాగంగా కళ్యాణ మండపంలో ప్రత్యేక ముత్యాలతో అలంకరించిన వేదికపై ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో అధిష్టింపజేశారు. ఆలయ పురోహితుడు కరి సీతారామాచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు బి.అప్పాజీ పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనాలు జరిపి ఆగమశాస్త్ర విధానంలో కళ్యాణాన్ని కమనీయంగా జరిపారు. భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. కాగా సింహాద్రి అప్పన్న స్వామిని కర్నూలుకు చెందిన ఎమ్మెల్యే కాటమనేని రామ్‌భూపాల్‌రెడ్డి దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలకగా అర్చకులు గోత్రనామాలతో పూజలు జరిపారు.


Updated Date - 2021-10-25T05:42:11+05:30 IST