కామారెడ్డిలో రుణం పేరిట సైబర్ మోసం

ABN , First Publish Date - 2022-01-05T15:48:48+05:30 IST

జిల్లాలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తక్కువ వడ్డీకి రుణం ఇస్తామని నమించి మోసానికి పాల్పడుతున్నారు.

కామారెడ్డిలో రుణం పేరిట సైబర్ మోసం

కామారెడ్డి: జిల్లాలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తక్కువ వడ్డీకి రుణం ఇస్తామని నమించి మోసానికి పాల్పడుతున్నారు. తాజాగా సదాశివనగర్ మండలం కుప్రియాల్  గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి  6 లక్షలు రుణం, 40 పైసలు వడ్డీకే మంజూరు అయిందని సైబర్ నేరగాళ్ల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. నిజమని నమ్మిన బాధితుడు... ట్యాక్స్, జీఎస్టీ పేరిట ముందస్తుగా ఫోన్ పే ద్వారా రూ.62,000, వివిధ రుసుముల పేరిట రూ.1,73,000 చెల్లించాడు. ఆపై రుణం డబ్బుల కొరకు ఫోన్ చేయగా స్విచాఫ్ రావడంతో తాను మోసపోయినట్లు బాధితుడు గుర్తించాడు. సైబర్ మోసంపై వెంటనే సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-01-05T15:48:48+05:30 IST