కామాక్షితాయికి వైభవంగా లక్ష కుంకుమార్చన

ABN , First Publish Date - 2021-08-04T05:07:42+05:30 IST

మండలంలోని జొన్నవాడ శ్రీమల్లికార్జునస్వామి, కామాక్షితాయి ఆలయంలో మంగళవారం కామాక్షితాయికి లక్ష కుంకుమార్చన పూజ వైభవంగా జరిగింది.

కామాక్షితాయికి వైభవంగా లక్ష కుంకుమార్చన
జొన్నవాడ ఆలయంలో కామాక్షితాయికి లక్ష కుంకుమార్చన పూజ

బుచ్చిరెడ్డిపాళెం, ఆగస్టు 3: మండలంలోని జొన్నవాడ శ్రీమల్లికార్జునస్వామి, కామాక్షితాయి ఆలయంలో మంగళవారం కామాక్షితాయికి లక్ష కుంకుమార్చన పూజ వైభవంగా జరిగింది.  ఉభయదాతల సహకారంతో 20మందికి పైగా అర్చకులు  పాల్గొని, లలితా సహస్రనామార్చనతో చేసిన లక్ష కుంకుమార్చన పూజ నిర్వహించారు. ఇందులో ఆలయానికి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. ముందుగా ఉభయదాతలు ఆలయంలో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపించారు.



Updated Date - 2021-08-04T05:07:42+05:30 IST