కనకదాస జీవితం ఆదర్శప్రాయం

ABN , First Publish Date - 2021-11-29T06:41:00+05:30 IST

భక్త కనకదాస జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయం, అనుసరణీయమని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి శంకరనారా యణ తెలిపారు.

కనకదాస జీవితం ఆదర్శప్రాయం
సంఘీభావం తెలుపుతున్న మంత్రి, నాయకులు


అనంతపురం క్లాక్‌టవర్‌, నవంబరు 28: భక్త కనకదాస జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయం, అనుసరణీయమని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి శంకరనారా యణ తెలిపారు. జిల్లా కురుబసంఘం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక గుత్తి రోడ్డులో ఉన్న కనకదాస కళ్యాణమండపంలో కనకదాస జయంతి ఉత్సవాలు నిర్వహించారు. అంతకు ముందు పాతూరులోని ఐదులైట్ల కూడలి లో ఉన్న కనకదాస విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించా రు. మంత్రితో పాటు మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారఽథి, సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్‌ కనకదాస చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విద్య నభ్యసించాలని, కనకదాస జీవితాన్ని అవగాహన చేసుకోవాల న్నారు. .మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి, సీపీఐ జిల్లా కార్య దర్శి జగదీష్‌ మాట్లాడుతూ కురుబలలో చైతన్యం రావాల్సిన అ వసరం ఉందని, ఐకమత్యంతో తమ సమస్యల సాధనకు పోరాడాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతుగా జాతికి సహా య సహకారాలు అందించా లన్నారు. కాగినెల్లి కనకగురు పీఠాధిపతి సిద్ద రమణానందస్వామి మానవ సమాజంలో ఆధ్యాత్మికత, సమాజ రుగ్మతలపై కనకదాస విశ్లేషణ అద్భు తంగా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ కనకదాస జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కురబ కార్పొరేష న చైర్మన కోటి సూర్యప్రకాష్‌, మాజీ మేయర్‌ రాగు పరుశురామ్‌, కురుబసంఘం జిల్లా అధ్యక్షుడు రాజహంస శ్రీనివా సులు, ప్రధాన కార్యదర్శి శివబాల, ఉపాధ్యక్షులు కొనకొండ్ల రాజేష్‌, నాయకులు త దితరులు పాల్గొన్నారు. 

కనగానపల్లి: మండలంలోని మామిళ్లపల్లిలో ఆదివారం భక్త కనక దాస జయంతిని కురుబలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భం గా కోనాపురం ఎంపీటీసీ రాజేశ్వరి హాజరై కేక్‌ కట్‌ చేశారు. అంతకు ముందు కనకదాస చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పిం చారు. వైస్‌ సర్పంచ మల్లికార్జున, కత్తేగోపాల్‌, బయన్న, వినోద్‌, లక్ష్మీ నారాయణ, వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-29T06:41:00+05:30 IST