జిల్లా ప్రధాన న్యాయస్థానం ప్రారంభం

ABN , First Publish Date - 2022-06-03T06:19:51+05:30 IST

జిల్లాకేంద్రంలోని కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన నూతన జిల్లా ప్రధాన న్యాయస్థానం (ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ కోర్టు)ను హైదరాబాద్‌ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్‌వీ వి.రమణ ఆన్‌లైన్‌(వర్చువల్‌)ద్వారా ప్రారంభించారు.

జిల్లా ప్రధాన న్యాయస్థానం ప్రారంభం
జిల్లా ప్రధాన న్యాయమూర్తి కనకదుర్గకు శుభాకాంక్షలు తెలుపుతున్న న్యాయవాదులు

- న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన కనకదుర్గ

గద్వాల క్రైం, జూన్‌ 2 : జిల్లాకేంద్రంలోని కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన నూతన జిల్లా ప్రధాన న్యాయస్థానం (ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ కోర్టు)ను హైదరాబాద్‌ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్‌వీ వి.రమణ ఆన్‌లైన్‌(వర్చువల్‌)ద్వారా ప్రారంభించారు. అనంతరం జిల్లా తొలి ప్రధాన న్యాయమూర్తిగా కనకదుర్గ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కోర్టు ఏర్పాటుతో కక్షిదారులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పని ఉండదని, కేసులను ఇక్కడే పరిష్కరించుకోవచ్చారు. కేసులు త్వరితగతిన పరిష్కారం అయ్యే వీలుంటుందని తెలిపారు. జిల్లాలోని న్యాయస్థానాల్లో నారీశక్తి ఎక్కువగా ఉన్నదని, ఎక్కువగా మహిళా న్యాయమూర్తులే ఉన్నారని పలువురు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం నూతన ప్రధాన న్యాయమూర్తికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ఒకటవ అదనపు జిల్లా న్యాయమూర్తి అన్నేరోజా, ప్రిన్సిపాల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి గంట కవిత, ప్రిన్సిపాల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కర్నాటి కవిత, ఒకటవ అదనపు సివిల్‌ జడ్జి గాయత్రి, మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు శోభారాణి, ప్రధాన కార్యదర్శి మధుసూదన్‌బాబు, సభ్యులు పూజారి శ్రీధర్‌, పూజారి శ్రీనిత, శ్రీలేఖ, మనోహర్‌, రాజశేఖర్‌ రెడ్డి, ప్రభుత్వ న్యాయవాదులు కృష్ణారెడ్డి, ఆనంద్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-03T06:19:51+05:30 IST