నిండుకుండలా ‘కండలేరు’

ABN , First Publish Date - 2021-11-29T03:02:14+05:30 IST

కండలేరు జలాశయం నిండు కుండలా మారింది. జలాశయంలో ఇప్పటికే 58 టీఎంసీల నీరు చేరొంది

నిండుకుండలా ‘కండలేరు’
డ్యాం నుంచి విడుదలవుతున్న నీరు 28ఆర్పీఆర్‌3 డ్యాం నీటిలో మునిగిపోయిన తాటిచెట్లు

రాపూరు, నవంబరు 28: కండలేరు జలాశయం నిండు కుండలా మారింది. జలాశయంలో ఇప్పటికే 58 టీఎంసీల నీరు  చేరొంది. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా డ్యాం నుంచి 1450 క్యూసెక్కుల నీటిని పిన్నేరు, సత్యసాయి గంగ కాలువ ద్వారా  స్వర్ణముఖికి నీటిని విడుదల చేస్తున్నారు. చీప్‌ ఇంజనీరు హరినారాయణరెడ్డి మాట్లాడుతూ ముందుజాగ్రత్త చర్యగా నీటిని విడుదల చేస్తున్నట్లు  వివరించారు. వరుస వర్షాలతో జలాశయంకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. 

Updated Date - 2021-11-29T03:02:14+05:30 IST