Abn logo
Aug 31 2021 @ 18:29PM

సీఎం జగన్ ప్రాంతీయ విభేదాలను పక్కన పెట్టాలి: కందుల

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రాంతీయతత్వాన్ని, ప్రాంతీయ విభేదాలను పక్కన పెట్టాలని మార్కాపురం మాజీ ఎమ్మెల్యే  కందుల నారాయణ‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వెలిగొండ ప్రాజెక్ట్‌ను గెజిట్‌లో చేర్చే విషయంపై వైసీపీ నుంచి ఏ ఒక్కరు మాట్లాడడం లేదన్నారు. ఈ ప్రాజెక్ట్‌ను గెజిట్‌లో చేర్చే వరకు టీడీపీ పోరాటం చేస్తుందన్నారు. ప్రకాశం జిల్లా ప్రజల ఓట్లు తీసుకొని, ఇప్పుడు ఆ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులకు రావాల్సిన 1200 కోట్ల బకాయిలను రాష్ట్రప్రభుత్వం చెల్లించడం లేదన్నారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ సామర్థ్యం ఇటీవల పెంచిన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఖరీ అనుమానస్పదంగా ఉందని కందుల నారాయణ‌రెడ్డి తెలిపారు.