Abn logo
Sep 24 2021 @ 23:45PM

కనీస వేతనాలివ్వండి

నగరంలో ర్యాలీ చేపడుతున్న స్కీం వర్కర్స్‌

కలెక్టరేట్‌ ఎదుట స్కీం వర్కర్ల ధర్నా


నెల్లూరు (వైద్యం), సెప్టెంబరు 24 : ఆశ, అంగనవాడీ, మధ్యాహ్న భోజనం వంటి పథకాల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం రూ.21వేలు ఇవ్వాలని స్కీం వర్కర్స్‌ యూనియన నేతలు డిమాండ్‌ చేశారు. శుక్రవారం దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా యూనియన ఆధ్వర్యంలో నెల్లూరులో ప్రదర్శన చేపట్టారు. వీఆర్సీ సెంటర్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. యూనియన నేతలు షాహినా బేగం, మస్తానబీ, బత్తల కిష్ణయ్య, అల్లాడి గోపాల్‌  మాట్లాడుతూ స్కీం వర్కర్లకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించినా నేటికీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌక ర్యాలు, ఉద్యోగ విరమణ ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. కరోనా సమ యంలోనూ ప్రాణాలకు తెగించి పనిచేసిన కార్మికులకు రూ.50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలన్నారు. అనంతరం డీఆర్వోకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో యూనియన నేతలు సంపూర్ణ, కుమారి, భాగ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు.