Abn logo
Sep 19 2020 @ 13:24PM

దేశంలో టాలీవుడ్‌దే అగ్ర స్థానం: కంగన

Kaakateeya

భారతదేశంలోని అన్ని చిత్రపరిశ్రమల్లోనూ బాలీవుడ్ పెద్దదని అందరూ అనుకుంటారని, అయితే ప్రస్తుతం టాలీవుడ్ ఆ స్థానాన్ని ఆక్రమించిందని బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తాజాగా పేర్కొంది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో అతిపెద్ద ఫిలింసిటీ నిర్మించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించిన సంగతి తెలిసిందే. 


ఈ ప్రకటనపై కంగన స్పందిస్తూ.. `ఈ దేశంలో నెంబర్ వన్ చిత్ర పరిశ్రమ బాలీవుడ్ అని అందరూ అనుకుంటారు. అయితే అది తప్పు. ప్రస్తుతం టాలీవుడ్ అగ్రస్థానంలోకి వచ్చింది. పాన్-ఇండియా సినిమాలను తరచుగా నిర్మిస్తోంది. ఎన్నో హిందీ సినిమాలు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలోనే షూటింగ్‌లు జరుపుకుంటాయి. యోగీ ఆదిత్యానాథ్ చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. సినీ పరిశ్రమలో చాలా మార్పులు తీసుకురావాలి. అన్ని చిత్ర పరిశ్రమలు కలిసి ఓకే `భారతీయ చలనచిత్ర పరిశ్రమ`గా ఏర్పడాలి. మనం ఇలా విడిపోవడం వల్ల హాలీవుడ్ లాభపడుతోంద`ని కంగన ట్వీట్లు చేసింది. 




Advertisement
Advertisement
Advertisement