రోడ్డు మీద జనాలు చట్టాల్ని చేయడమా? నాకు నచ్చలేదు... Kangana కామెంట్స్

ABN , First Publish Date - 2021-11-19T18:51:05+05:30 IST

ఎప్పుడూ మోదీని నిర్మొహమాటంగా సమర్థించే కంగనా రనౌత్ ఈసారి హర్టైంది. ప్రధాని నిర్ణయం ఆమెకు ఎంత మాత్రం నచ్చలేదు. అదే విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది ‘తలైవి’. మాజీ ప్రధాని ఇందిరా గాంధీని కూడా ఆమె తలుచుకుంది...

రోడ్డు మీద జనాలు చట్టాల్ని చేయడమా? నాకు నచ్చలేదు... Kangana కామెంట్స్

ఎప్పుడూ మోదీని నిర్మొహమాటంగా సమర్థించే కంగనా రనౌత్ ఈసారి హర్టైంది. ప్రధాని నిర్ణయం ఆమెకు ఎంత మాత్రం నచ్చలేదు. అదే విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది ‘తలైవి’. మాజీ ప్రధాని ఇందిరా గాంధీని కూడా ఆమె తలుచుకుంది...


సిక్కులకు అత్యంత పవిత్రమైన గురు పూర్ణిమ రోజున నరేంద్ర మోదీ అనూహ్య ప్రకటన చేశారు. చాలా రోజులుగా పంజాబ్ రైతులు వద్దంటోన్న వ్యవసాయ చట్టాల్ని రద్దు చేస్తామని అన్నారు. అంతే కాదు, ఆయన క్షమాపణ కూడా చెప్పటం అందర్నీ ఆశ్చర్యపరిచింది. కానీ, ఇంత కాలం మోదీ తీసుకొచ్చిన చట్టాల్ని బలంగా సమర్థించిన వారు మాత్రం కొంత షాక్‌కి గురికాక తప్పలేదు. అటువంటి వారిలో కంగనా రనౌత్ కూడా ఒకరు. ఆమె మొదట్నుంచీ అగ్రికల్చర్ లాస్‌ని గట్టిగా సపోర్ట్ చేస్తోంది. అందుకోసం సొషల్ మీడియాలో ఇతర సెలబ్రిటీలతోనూ వాగ్యుద్ధాలు చేసింది. పంజాబీ నటుడు దిల్జీత్ దోసాంజ్ మొదలు అమెరికన్ సింగర్ రిహానా వరకూ అందర్నీ కడిగిపారేసింది. ఇంతా చేస్తే ఇప్పుడు పీఎం స్వయంగా చట్టాల్ని రద్దు చేస్తామని ప్రకటించటం బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్‌కు అస్సలు నచ్చలేదు. 


సొషల్ మీడియాలో ఒక నెటిజన్ పోస్టుని షేర్ చేసిన కంగనా, తన అభిప్రాయం చెబుతూ ‘‘విషాదకరం, అవమానకరం, ఇది పూర్తిగా అన్యాయం. ఎన్నుకోబడ్డ ప్రభుత్వం కాకుండా రోడ్డు మీది జనం చట్టాలు చేయటం మొదలు పెడితే ఇక మనది కూడా ఒక జిహాదీ దేశమే. ఇటువంటి స్థితి కోరుకున్న వారందరికీ శుభాకాంక్షలు...’’ అంది. మరో పోస్టులో ఇందిరా గాంధీ 104వ జయంతి సందర్భంగా మాజీ ప్రధానిని కూడా తలుచుకుంది కంగనా. అయితే, ప్రస్తుత పరిస్థితికి ముడిపెడుతూ అప్పట్లో ఇందిర చెప్పిన మాటల్ని ఆమె షేర్ చేసింది. దేశంలో పరిస్థితి ఆశించినట్టుగా లేనప్పుడు ‘లాఠీ’ వల్ల, నియంతృత్వం వల్ల మాత్రమే పరిష్కారం లభిస్తుందంటూ... ఇంగ్లీష్ కొటేషన్ కంగనా నెటిజన్స్ ముందుంచింది! వ్యవసాయ చట్టాల వంటి నిర్ణయాలు నియంతృత్వ పాలన వల్ల మాత్రమే సాధ్యం అవుతాయని ఆమె అభిప్రాయం కాబోలు... 

Updated Date - 2021-11-19T18:51:05+05:30 IST