Abn logo
Nov 26 2020 @ 13:02PM

చిత్ర పరిశ్రమ ఆ నాలుగు కుటుంబాలదే కాదు: కంగన

బోల్డ్ క్వీన్ కంగనా రనౌత్ మరోసారి బాలీవుడ్ సినీ ప్రముఖులపై ఫైర్ అయింది. ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో బాలీవుడ్ ప్రముఖులను విమర్శించిన కంగన తాజాగా మరోసారి విరుచుకుపడింది. 93వ ఆస్కార్ పురస్కారాల పోటీకి భారతదేశం తరఫున మలయాళ సినిమా `జల్లికట్టు` ఎంపికైన సంగతి తెలిసిందే. 


ఈ నేపథ్యంలో `జల్లికట్టు` టీమ్‌ను ప్రశంసిస్తూ కంగన తాజాగా ఓ ట్వీట్ చేసింది. ఈ క్రమంలో బాలీవుడ్ ప్రముఖులను కూడా విమర్శించింది. `అందరిపై అధికారం చలాయించాలని చూసే బుల్లీడవుడ్ గ్యాంగ్‌కు సరైన శాస్తి జరిగింది. భారతీయ చిత్ర పరిశ్రమ కేవలం నాలుగు కుటుంబాలకు చెందినది మాత్రమే కాదు. మూవీ మాఫియా గ్యాంగ్.. ఇళ్లలోనే దాక్కొండి. జ్యూరీ తన విధిని పక్కాగా నిర్వర్తిస్తోంది. `జల్లికట్టు` చిత్రబృందానికి అభినందనల`ని కంగన కామెంట్ చేసింది. 


Advertisement
Advertisement
Advertisement