Abn logo
Aug 10 2020 @ 17:32PM

రణ్‌బీర్ `రేపిస్ట్`.. దీపిక `సైకో`: కంగన

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేపై కంగనా రనౌత్ డిజిటల్ టీమ్ తీవ్ర విమర్శలు చేసింది. రణ్‌బీర్ కపూర్‌ను స్త్రీలోలుడిగా, దీపికను మానసిక వ్యాధిగ్రస్తురాలుగా పేర్కొంది. `బాంబే వెల్వెట్`, `బేషరమ్`, `జగ్గా జాసూస్` వంటి భారీ ఫ్లాపుల తర్వాత కూడా రణ్‌బీర్‌కు భారీ ప్రాజెక్ట్‌లు లభించాయని, సుశాంత్‌కు `రాబ్తా`, కంగనకు `రంగూన్` వంటి ఫ్లాపులు పడగానే వారిని ఇండస్ట్రీ దూరం పెట్టేసింద`నే ట్వీట్‌కు కంగన డిజిటల్ టీమ్ స్పందించింది. 


`ఎప్పుడూ అమ్మాయిల వెంటపడే రణ్‌బీర్‌ను ఎవరూ `రేపిస్ట్` అని పిలిచే ధైర్యం చేయలేరు. తనని తాను ఓ మానసిక వ్యాధిగ్రస్థురాలిగా ప్రకటించుకున్న దీపికను ఎవ్వరూ `సైకో` అని, `రాక్షసి` అని అనరు. చిన్న పట్టణాల నుంచి, సాధారణ కుటుంబాల నుంచి వచ్చే వారికే ఇలాంటి పేర్లను కేటాయిస్తార`ని కంగన డిజిటల్ టీమ్ ట్వీట్ చేసింది. 




Advertisement
Advertisement
Advertisement