Advertisement

చంపుతామంటూ బెదిరింపులపై కేసు పెట్టిన Kangana Ranaut.. నాకు భయం లేదు.. సీఎంకి చెప్పండంటూ సోనియా గాంధీకి..

బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ దేశంలో జరిగే విషయాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. వాటి వల్ల కేసుల్లో ఇరుక్కోవడం, బెదిరింపులు ఎదుర్కోవడం తెలిసిందే. అందుకే అందరూ ఈ భామని ఫైర్ బ్రాండ్ అంటూ ఉంటారు. తాజాగా పంజాబ్ సిక్కులపై చేసిన ‘ఖలిస్తాన్ తీవ్రవాదులు’ కామెంట్స్ గురించి బెదిరింపులు ఎదుర్కొంది. తాజాగా వాటిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది ఈ బ్యూటీ.


అంతేకాకుండా గోల్డెన్ టెంపుల్ వద్ద దండపెట్టుకుంటున్న ఫోటోని షేర్ చేసి,, ఈ బెదిరింపులపై సోషల్ మీడియాలో పోస్ట్ సైతం పెట్టింది. అందులో.. ‘ముంబయిలో జరిగిన ఉగ్రదాడిలో అమరులైన వారిని స్మరించుకుంటూ దేశద్రోహులను ఎప్పటికీ క్షమించకూడదని, మరచిపోకూడదని రాశాను. ఈ తరహా ఘటనల్లో దేశ అంతర్గత ద్రోహుల హస్తం ఉంది. డబ్బు కోసం మరియు కొన్నిసార్లు పదవి మరియు అధికారం కోసం భారత మాతను కించపరిచే ఒక్క అవకాశాన్ని కూడా దేశద్రోహులు వదిలిపెట్టలేదు. దేశంలోని దేశద్రోహులు కుట్రలు చేయడం ద్వారా దేశ వ్యతిరేక శక్తులకు సహాయం చేస్తూనే ఉన్నారు. అది ఇలాంటి దారుణాలకు దారితీసింది.


ఈ పోస్ట్‌పై విధ్వంసక శక్తుల నుంచి నాకు నిరంతరం బెదిరింపులు వస్తున్నాయి. బటిండాకు చెందిన ఒక సోదరుడు నన్ను చంపేస్తానని బహిరంగంగా బెదిరించాడు. ఇలాంటి బెదిరింపులకు నేను భయపడను. దేశానికి వ్యతిరేకంగా, తీవ్రవాద శక్తులకు సహాయం చేసేవారికి వ్యతిరేకంగా మాట్లాడతాను. ఇది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. విదేశాలలో కూర్చున్న కొందరు ఉగ్రవాదులు అమాయక జవాన్‌లను చంపడం ద్వారా ఎనభైలలో పంజాబ్‌లోని గురువుల పుణ్యభూమిని ఇండియా నుంచి దూరం చేసి ఖలిస్తాన్‌ని తయారు చేయాలని కలలు కంటున్నారు.


ప్రజాస్వామ్యం మన దేశానికి అతిపెద్ద బలం. ఏ పార్టీ అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు కానీ పౌరుల సమగ్రత, ఐక్యత, ప్రాథమిక హక్కులను పరిరక్షించే హక్కు, భావా వ్యక్తీకరణ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా మనకు అందించారు. నేను ఏ కులం, మతం లేదా సమూహం గురించి కించపరిచేలా లేదా ద్వేషపూరితంగా మాట్లాడలేద’ని అందులో రాసుకొచ్చింది.


అంతేకాకుండా, అంతేకాకుండా ఈ బెదిరింపులపై కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీకి ఉద్దేశిస్తూ..‘ మీరు కూడా ఒక మహిళ, మీ అత్తగారు ఇందిరా గాంధీ చివరి క్షణం వరకు ఈ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడారు. అటువంటి తీవ్రవాద, విధ్వంసక, దేశ వ్యతిరేక శక్తుల నుంచి బెదిరింపుల గురించి తక్షణమే చర్యలు తీసుకోవాలని దయచేసి పంజాబ్ ముఖ్యమంత్రిని ఆదేశించండం’టూ కోరింది. తనకి ఎవరన్న భయం లేదని, అది జరగదని చెప్పింది. దేశం కోసం ద్రోహుల గురించి బహిరంగంగా మాట్లాడుతూనే ఉంటానని తెలిపింది.

Advertisement

Bollywoodమరిన్ని...