May 8 2021 @ 11:08AM

కంగ‌నా ర‌నౌత్‌కు క‌రోనా పాజిటివ్‌

బాలీవుడ్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ క‌రోనా బారిన ప‌డింది. త‌న‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌నే విష‌యాన్ని కంగ‌నానే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియ‌జేసింది. ‘‘కొన్ని రోజుల నుంచి క‌ళ్లు మండుతున్నాయి. అల‌స‌ట‌గా, నీర‌సంగా అనిపించేది. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌కు వెళ‌దామ‌ని కొవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. ఈరోజు(శ‌నివారం) క‌రోనా పాజిటివ్ అనే రిజ‌ల్ట్ వ‌చ్చింది. సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉంటున్నాను. నా శ‌రీరంలో క‌రోనా వైర‌స్ పార్టీని సెల‌బ్రేట్ చేసుకుంటాయ‌ని నేను భావించ‌డం లేదు. నేను వాటిని నాశ‌నం చేస్తాను. మీరు భ‌య‌ప‌డితే, క‌రోనా మ‌రింత భ‌య‌పెడుతుంది. రండి మ‌నం దాన్ని నాశనం చేద్దాం. కొవిడ్ 19 అంటే భ‌య‌ప‌డేంత ఏమీ లేదు. చిన్న‌పాటి ఫ్లూ మాత్ర‌మే, అయితే ప్ర‌జ‌ల‌ను మాన‌సికంగా ఒత్తిడికి గురి చేస్తోంది’’ అన్నారు కంగ‌నా ర‌నౌత్‌.