కంగన నుంచి పద్మశ్రీ వెనక్కి తీసుకోండి: ఎన్‌సీపీ

ABN , First Publish Date - 2021-11-12T17:59:50+05:30 IST

దేశ స్వాతంత్ర్యం 2014లో వచ్చిందని, 1947లో లభించింది 'భిక్ష' అనీ బాలీవుడ్ నటి కంగనా..

కంగన నుంచి పద్మశ్రీ వెనక్కి తీసుకోండి: ఎన్‌సీపీ

ముంబై: దేశ స్వాతంత్ర్యం 2014లో వచ్చిందని, 1947లో లభించింది 'భిక్ష' అనీ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆమె చేసిన వ్యాఖ్యలను మహారాష్ట్ర మంత్రి, ఎన్‌సీపీ నేత నవాబ్ మాలిక్ తీవ్ర స్థాయిలో ఖండించారు. మలానా క్రీమ్ (డ్రగ్స్) మత్తు బాగా తలకెక్కినట్టు కనిపిస్తోందంటూ మండిపడ్డారు. భారతదేశ దాస్య విముక్తి కోసం పోరాడిన వేలాది మంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను అవమానపరిచే విధంగా ఆమె చేసిన వ్యాఖ్యలు గర్హనీయమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆమెకు ఇచ్చిన పద్మశ్రీ అవార్డును తక్షణం వెనక్కి తీసుకోవాలని, ఆమెను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు..


ఇటీవల పద్మశ్రీ అవార్డు అందుకున్న కంగనా రనౌత్ ఓ కాంక్లేవ్‌లో పాల్గొన్న సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. భారత్‌కు 2014లో స్వాతంత్ర్యం వచ్చిందని, 1947లో లభించింది భిక్ష అనీ, అలాంటి దాన్ని ఆజాదీగా పరిగణిస్తామా అంటూ వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేత వరుణ్ సింగ్ సైతం విమర్శలు గుప్పించారు. ''కొన్నిసార్లు మహాత్మాగాంధీ త్యాగాలను అవమానిస్తున్నారు. ఇంకొన్నిసార్లు మహాత్మాగాంధీ హంతకుడు గాడ్సేకు గౌరవం కట్టబెడుతున్నారు. ఇప్పుడు లక్షలాది మంది స్వాతంత్ర్య సమరయోధులను...షహీద్ మంగల్ పాండే నుంచి రాణి లక్ష్మీ భాయ్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, నేతాజీ సుభాష్ చంద్ర బోస్ వరకూ అందర్నీ అవమానిస్తున్నారు. ఇది పిచ్చితనం అనాలా? దేశద్రోహం అనాలా?'' అని నిలదీశారు

Updated Date - 2021-11-12T17:59:50+05:30 IST